పూజ్య గురూజీ గురించి క్లుప్తం గా:

‘గు’ అనగా అజ్ఞానం మరియు ‘రు’ అంటే తొలగించేవాడు. గురువు అంటే అజ్ఞానం లేదా చీకటిని పారద్రోలేవాడు. పరమాత్ముడు తన కృపతో ఆత్మలను విముక్తి చేయడానికి మరియు వాటి అంతిమ గమ్యస్థానానికి చేరుకోవడానికి అంటే మోక్షం పొందడానికి లేదా తనలో విలీనం చేయడానికే గురువు అయ్యారు .ఆయన ఒక మహా యోగి

జనన మరణాల ఉచ్చులో చిక్కుకున్న సాధారణ ఆత్మలకు జీవించే కళను మాత్రమే కాకుండా, మరింత ముఖ్యంగా విడిచిపెట్టే కళను కూడా నేర్పించడానికి ప్రభువు ”శ్రీ సద్గురు డాక్టర్ కె. శివానంద మూర్తి గారి i” రూపాన్ని తీసుకున్నారు. ఆయనను ఆయన శిష్యులు "గురువుగారు", "గురుజీ" అని పిలిచేవారు.

గురువుగారు, తన శిష్యులకు విస్తృత శ్రేణి విషయాలపై జీవితంలోని వివిధ అంశాలపై మరియు అనేక ఆత్మలను ప్రభావితం చేస్తూ బోధించారు. ఆయన ప్రసంగాలు అనేక ఆత్మలకు మోక్ష కోరికను జనింపజేసి,ఉద్ధరింపజేయడమే కాకుండా, వాటిని మోక్షమార్గం వైపు వేగవంతం చేయడానికి కూడా సహకరించాయి.

ఈ గొప్ప దేశం పట్ల, దాని సనాతన ధర్మం పట్ల ఆయన చేసిన వివిధ ప్రసంగాల ద్వారా ఆయన గొప్ప దేశభక్తుడు అని స్పష్టంగా తెలుస్తుంది. ఆయన పంచుకున్న అనేక జ్ఞాన ముత్యాలలో ఒకటి, “కళ్ళు తెరిచి ఉన్నప్పుడు దేశం కోసం ఆలోచించి పని చేయాలి మరియు అవి మూసుకున్నప్పుడు జీవుడుతన గురించి ఆలోచించాలి”. [VC1.1]

సమాజ క్షేమము ఇంకా భద్రత జీవులని ధర్మ మార్గం లో నడిపించి వారిని ఉద్దరించడానికి చాలా కీలకమయినదని చెప్పేవారు. సామూహిక ధ్యానం సామాజికి క్షేమము మరియు భద్రతని ఇవ్వగలదు. ఇట్టి ధ్యానము లో పాల్గొనడము వలన వ్యక్తిగత ధ్యానం కంటే అనేక రేట్లు ఫలితాన్ని ఇవ్వగలదు.

ఆయన దిశానిర్దేశం ఆధారంగా, ఈ సైట్ మన దేశాన్ని మరియు దేశ పౌరులను క్షేమంగా మరియు సురక్షితంగా ఉంచడానికి వ్యక్తులు సమూహ ధ్యానంలో పాల్గొనడానికి సహాయపడుతుంది.

అన్వేషకులు ఇంకా సాధకుల కోసం, గురూజీ రచించిన అనేక పుస్తకాలు అందుబాటులోనే ఉంటాయి. అంతే కాకుండా ఆయన ప్రసంగాలు YouTubeలో సద్గురు శివానంద మూర్తి, MRSKK99, శివానంద గురుధామ్ ఛానెల్‌లలో అందుబాటులో ఉన్నాయి.

Schedule

6:00 AM: Pranayamam

2:00 PM: Pranayamam

7:00 PM: Samhooki Dhyanam

10:00 PM: Pranayamam

సంప్రదించండి

రవికాంత్

9493480209

భాస్కర్

9573447744

ప్రియాంక

9573504254

విశ్వదీప్

9920925652